కొత్త ఏడాది.. తెలివైన పెట్టుబడి | Why Health Insurance is the Smart Investment for 2025 | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాది.. తెలివైన పెట్టుబడి

Mar 29 2025 7:36 PM | Updated on Mar 29 2025 8:05 PM

Why Health Insurance is the Smart Investment for 2025

వైద్య ఖర్చులు అనూహ్యంగా పెరుగుతున్న ఈ కాలంలో వాటి కోసం కేవలం సొంత డబ్బుపైనే ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. ఊహించని అత్యవసర వైద్య పరిస్థితులు పొదుపు సొమ్మును హరించేస్తాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పెరుగుతున్న వైద్య ఖర్చుల నుండి ఒక ముఖ్యమైన రక్షణ కవచంగా నిలుస్తుంది. ఆర్థిక ఒత్తిడి లేకుండా నాణ్యమైన వైద్య సంరక్షణను అందిస్తుంది. గుర్తుంచుకోండి.. మీరు ఆరోగ్యంపై పెట్టుబడి పెడుతున్నారంటే.. మీతోపాటు కుటుంబ భవిష్యత్తు కోసం కూడా పెట్టుబడి పెడుతున్నారని అర్థం.

సంపూర్ణ కవరేజీ 
ఆధునిక ఆరోగ్య బీమా ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే కాదు.. ఓపీడీ సంప్రదింపులు, టెలిమెడిసిన్, ప్రివెంటివ్ చెకప్‌లు, వెల్‌నెస్ కార్యక్రమాలను కూడా కవర్ చేస్తుంది. చాలా పాలసీలు ఇప్పుడు ప్రసూతి సంరక్షణ, మానసిక ఆరోగ్యం, రీహాబిలిటేషన్‌ థెరపీ వంటి సేవలతో సంపూర్ణ కవరేజీ అందిస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక రక్షణ చాలా కీలకం. వ్యాధి-నిర్దిష్ట విధానాలు, క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్లు దీర్ఘకాలిక భద్రతను నిర్ధారిస్తాయి.

పన్ను ప్రయోజనాలూ..
ఇటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద గణనీయమైన పన్ను ప్రయోజనాలను అందించడంతో పాటు అటు అవసరమైన ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందించే రెండు వైపులా పదునుండే కత్తిలా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పనికొస్తుంది. ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఇది ఆర్థికంగా తెలివైన పెట్టుబడిగా మారుతుంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు తమ ఆరోగ్య బీమా ప్రీమియంపై సంవత్సరానికి రూ .25,000 వరకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సీనియర్ సిటిజన్ల సిటిజన్ల విషయానికి వస్తే.. వారికి వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ పరిమితి రూ .50,000 వరకు ఉంటుంది.

ఎస్‌బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో విభిన్న ప్లాన్లు
ఎస్‌బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభిన్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సరసమైన, సౌకర్యవంతమైన ప్లాన్లను అందిస్తోంది. ఈ పాలసీలు హాస్పిటలైజేషన్, ఓపీడీ కన్సల్టేషన్లు, ప్రసూతి ప్రయోజనాలు, క్రిటికల్ ఇల్‌నెస్‌తో సహా విస్తృతమైన కవరేజీతో పాలసీదారులరకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తాయి.

మనం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, ఆరోగ్య బీమా పాలసీలో పెట్టుబడి పెట్టడం ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వానికి ఒక ముఖ్యమైన దశ. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఖర్చు మాత్రమే కాదు, ఇది మీ ఆర్థిక, శారీరక శ్రేయస్సు కోసం తెలివైన పెట్టుబడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement