‘ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యా’..మూడు నిమిషాల్లో 900 మంది తొలగింపుపై.. | Better Com CEO Vishal Garg Who Fired 900 Staff On Zoom Call, Underwent Leadership Training - Sakshi
Sakshi News home page

మూడే నిమిషాల్లో 900 మంది ఉద్యోగుల తొలగింపు.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యా

Published Sat, Aug 26 2023 12:46 PM

Better Com CEO Vishal Garg Who Fired 900 Staff On Zoom Cal, Underwent Leadership Training - Sakshi

అనాలోచితమైన నిర్ణయాల కారణంగా నిత్యం వార్తల్లో నిలిచే మోర్టగేజ్‌ లెండింగ్‌ కంపెనీ బెటర్‌ డాట్‌ కామ్‌ సీఈవో విశాల్‌ గార్గ్‌ మంచి నాయకుడిగా ఎదిగేందుకు శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. 

తాజాగా టెక్నాలజీ మీడియా సంస్థ టెక్‌క్రంచ్‌ విశాల్‌ గార్గ్‌తో ఇంటర్వ్యూ జరిపింది. ఈ సందర్భంగా బెటర్‌ డాట్‌ కామ్‌లో మంచి బాస్‌గా ఉండేందుకు చాలా ప్రయత్నించినట్లు తెలిపారు. 

2021 డిసెంబర్‌ నెలలో సీఈవో విశాల్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఆ మీటింగ్‌ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల్లో 900 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు మూటగట్టుకున్నారు. లేఆఫ్స్‌ బాధితుల్లో అధిక వేతనాలు తీసుకున్న 250 మందికి పైగా ఉన్నారు. వాళ్లే చేయాల్సి పనివేళల గంటే ఎక్కువ సేపు పనిచేశారని ఫార్చ్యూన్ మ్యాగజైన్ తెలిపింది.

శిక్షణ తీసుకున్నా
అయితే, ఆ భారీ లేఆఫ్స్‌ తర్వాత మంచి బాస్‌గా ఎదిగేందుకు, సిబ్బంది తనని నమ్మేలా ప్రయత్నించినట్ల, ఇందుకోసం ట్రైనింగ్‌ తీసుకున్నట్లు టెక్‌ క్రంచ్‌కు చెప్పారు. తద్వారా ఉద్యోగులను చూసే ధోరణి మార్చుకున్నానని, వారిపట్లు సానుభూతితో మెలిగేలా శిక్షణ తీసుకున్నారు. కస్టమర్లతో సైతం అదే తరహాలో ఉండేలా కష్టపడినట్లు వెల్లడించారు. 

చిన్న లాజిక్‌ అర్ధమైంది
కంపెనీ లక్ష్యం, సంస్థ ఎదుగుదలతో పాటు కస్టమర్లకు సంతృప్తి కలిగించడంపై దృష్టి సారించినట్లు గార్గ్ పేర్కొన్నారు. తన క్లయింట్‌లు సంతృప్తి చెందాలంటే తన ఉద్యోగులు సంతోషంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని తాను గ్రహించినట్లు చెప్పారు.  

ప్రస్తుతం Better.com లో వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నారని గార్గ్ తెలిపారు. ఇటీవలే అరోరా అక్విజిషన్ కార్ప్ అనే సంస్థతో గార్గ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఈ డీల్ కొంతకాలం వాయిదా పడింది. బెటర్‌.కామ్‌ షేర్లు నాస్డాక్ స్టాక్ మార్కెట్లో బీఈటీఆర్ గుర్తును ఉపయోగించి ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే ట్రేడింగ్ ప్రారంభం కాగానే షేరు విలువ 90 శాతానికి పైగా పడిపోయింది.

ఇక, తాజాగా టెక్‌క్రంచ్‌ జూమ్‌ ఇంటర్వ్యూతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సంస్థ బాగుండాలంటే ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే లాజిక్‌ను ఎలా మిస్‌ అయ్యారని ప్రశ్నిస్తున్నారు. తనని తాను మార్చుకునే దిశగా విశాల్‌ గార్గ్‌ శిక్షణ తీసుకోవడంపై అభినందనలు తెలుపుతున్నారు. 

Advertisement
Advertisement