బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే.. | Uber Gets Aggregator Licence To Operate Buses Under The Delhi Premium Bus Scheme | Sakshi
Sakshi News home page

బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..

Published Mon, May 20 2024 9:33 PM

Uber Gets Aggregator Licence to Operate Buses in Delhi Details

ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఉబర్.. బస్సులను నడపడానికి సిద్ధమైంది. ప్రీమియం బస్ స్కీమ్ కింద ఈ సర్వీసు ప్రారభించనున్నట్లు సమాచారం. అయితే మొదట ఈ సేవను దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రారంభించనుంది.

ఉబెర్‌కి బస్సులను నడపడానికి ఢిల్లీ రవాణా శాఖ అగ్రిగేటర్ లైసెన్స్ మంజూరు చేసింది. యాప్‌లో 'ఉబర్ షటిల్' ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రయాణికులు ఒక వారం ముందుగానే సీట్లను బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తరువాత లైవ్ లొకేషన్, రూట్‌ని ట్రాక్ చేయవచ్చు.

ఉబర్ బస్సులో ఒకసారికి 19 నుంచి 50 మంది ప్రయాణికులు పయనించవచ్చు. రోజు వారీ ప్రయాణాలను కూడా ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సర్వీసును మొదటి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పరీక్షించారు. ఇక త్వరలోనే ఈ సర్వీసును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆ తరువాత కోల్‌కతాలో ప్రారంభించే అవకాశం ఉంది.

బస్సు సర్వీస్ కోసం లైసెన్స్ పొందిన మొదటి కంపెనీగా ఉబెర్ అవతరించింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని ఢిల్లీ ప్రభుత్వంలోని రవాణా శాఖ అధికారి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సర్వీస్ ఇతర ప్రధాన నగరాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement