ఆ ఆప్షన్‌ తొలగింపు..ట్విటర్‌లో ఎలాన్‌ మస్క్‌ మరో కీలక నిర్ణయం | Twitter Will No Longer Tweet Was Sent Out From An Iphone Or An Android | Sakshi
Sakshi News home page

ఆ ఆప్షన్‌ తొలగింపు..ట్విటర్‌లో ఎలాన్‌ మస్క్‌ మరో కీలక నిర్ణయం

Dec 18 2022 7:43 PM | Updated on Dec 18 2022 8:57 PM

Twitter Will No Longer Tweet Was Sent Out From An Iphone Or An Android  - Sakshi

ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్విటర్‌లో ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల నుంచి ట్వీట్‌ చేస్తే .. సదరు ట్వీట్‌ ఏ ఫోన్‌ నుంచి ట్వీట్‌ చేశారో గుర్తించలేమని మస్క్‌ తెలిపారు. 

నెటిజన్‌ చేసిన ఓ ట్వీట్‌కు మస్క్‌ స్పందించారు. ఏ మొబైల్‌  డివైజ్‌ నుంచి ట్వీట్‌ చేశారో ఇకపై గుర్తించలేమని వెల్లడించారు. బిలియనీర్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి సంస్థలో  తీసుకొచ్చిన మరో అప్‌డేట్‌ అని పలు నివేదికలు చెబుతున్నాయి.   

మస్క్ గత నెలలో ఏ డివైజ్‌ నుంచి ట్వీట్‌ చేసిందో తెలిపే ఆప్షన్‌ను డిజేబుల్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఫంక్షన్‌ స్క్రీన్ స్పేస్ & కంప్యూటర్ కు వృధా అని పేర్కొన్నారు. ప్రతి ట్వీట్ క్రింద ఏ పరికరంలో ట్వీట్ చేశారో తెలిపే ఆప్షన్‌ను డిలీట్‌ చేస్తున్నాం.మేం ఎందుకు అలా చేశామో కూడా ఎవరికీ తెలియదన‍్నారు. కాగా,ఈ మార్పు కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ట్విటర్‌ బ్లూను విడుదల చేసిన వెంటనే వస్తుందని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement