Sakshi Money Mantra: Today Stock Market Updates By Karunya Rao On July 28th, 2023 - Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా: మళ్ళీ నష్టాల్లో సాగుతున్న స్టాక్ మార్కెట్లు

Jul 28 2023 8:48 AM | Updated on Jul 28 2023 10:02 AM

Today stock market updates sakshi money mantra july 28th 2023 - Sakshi

Today Stock Market: నిన్న ఉదయం స్టాక్ మార్కెట్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి, కానీ ఈ రోజు ప్రారంభం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 138.59 పాయింట్ల తగ్గుదలతో 66128.35 వద్ద.. నిఫ్టీ 30.60 పాయింట్ల నష్టాలతో 19659.80 వద్ద ముందుకు వెళుతున్నాయి. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా నష్టాల బాటలోనే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

బ్రిటానియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు టాప్ గెయిన్ లిస్ట్‌లో ఉన్నాయి. కాగా యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బీపీసీఎల్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్టీపీసి కంపెనీలు నష్టాల జాబితాలో ఉన్నాయి. ఈ రోజు ఫార్మా కంపెనీలు మంచి దూకుడు మీద ఉన్నట్లు స్పష్టమవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement