భారత్‌లో మరో టెస్లా కారు.. డెలివరీ షురూ! | Tesla Model Y L Deliveries Commence in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో మరో టెస్లా కారు.. డెలివరీ షురూ!

Jun 15 2026 5:34 PM | Updated on Jun 15 2026 6:04 PM

Tesla Model Y L Deliveries Commence in India

టెస్లా భారతదేశంలో లాంచ్ చేసిన మోడల్ వైఎల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. 6-సీటర్ ఎలక్ట్రిక్ SUV రూపంలో లాంచ్ అయిన ఈ కారు ప్రారంభ ధర రూ.61.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ మోడల్ కంటే కూడా విశాలమైన క్యాబిన్‌ పొందుతుంది. ఇది 2+2+2 సీట్ల అమరికలో ఉంటుంది.

మోడల్ YLలో 16-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెండవ వరుసలోని ప్రయాణీకుల కోసం 8-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్, 2వ వరుస సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, 19-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.

మోడల్ YL డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఇది 5.0 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుందని. ఇది ఒక ఫుల్ ఛార్జితో 681 కి.మీ రేంజ్ అందిస్తుందని టెస్లా పేర్కొంది. ఇది 250 kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 15 నిమిషాల్లో 288 కి.మీ వరకు ప్రయాణించగల ఛార్జింగ్ పొందగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement