‘చైనాకి యాపిల్‌ మరో భారీ షాక్‌!’ | Tata Group Plan For Build One Of The Largest Iphone Assembly Plant In India, See Details Inside - Sakshi
Sakshi News home page

‘చైనాకి యాపిల్‌ మరో భారీ షాక్‌!’, డ్రాగన్‌ కంట్రీని వద్దనుకుని.. టాటా గ్రూప్‌తో

Published Fri, Dec 8 2023 4:26 PM

Tata Group Plan For Build One Of The Largest Iphone Assembly - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ‍కంపెనీకి భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ల తయారీ కోసం డ్రాగన్‌ కంట్రీపై ఆధారపడడం ఏమాత్రం ఇష్టం లేని యాపిల్‌ భారత్‌లో మరో ఐఫోన్‌ తయారీ కేంద్రాన్ని నిర్మించనుంది. ఈ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను టాటా గ్రూప్‌ నెలకొల్పనుంది.  

ఈ ఏడాది అక్టోబర్‌లో కర్ణాటక కేంద్రంగా భారత్‌లో ఐఫోన్‌లను తయారు చేసే విస్ట్రాన్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను టాటా గ్రూప్‌ 125 మిలియన్‌ భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసింది. అయితే, బ్లూంబెర్గ్‌ నివేదిక ప్రకారం.. తమిళనాడు హోసుర్‌ కేంద్రంగా టాటా గ్రూప్‌ అధినేత రతన్‌ టాటా రెండో ఐఫోన్‌ తయారీ యూనిట్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నారని తెలిపింది. 

ఈ ఫ్యాక్టరీలో టాటా గ్రూప్‌ కనీసం 20 లైన్‌లో ఐఫోన్‌లను తయారు చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుందని, తద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశం కలుగుందని బ్లూంబెర్గ్‌ నివేదికలో పేర్కొంది. ఇక ఈ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ 12 నెలల నుంచి 18 నెలల లోపల అందుబాటులోకి రానుందని అంచనా.

చైనాకు భారీ షాక్‌  
టెక్‌ దిగ్గజం యాపిల్‌ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఫలితంగా చైనా కాకుండా మిగిలిన దేశాలైన భారత్‌, థాయిలాండ్‌, మలేషియాలలో ఐఫోన్‌ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు స్థానిక కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన టాటా కంపెనీ ఐఫోన్‌లు తయారు చేసుకునేలా ఒప్పందం కుదర్చుకుంది.

ఇప్పటికే భారత్‌లోని కర్ణాటక కేంద్రంగా ఐఫోన్‌లను మ్యానిఫ్యాక్చరింగ్‌ చేస్తున్న విస్ట్రాన్‌ కార్పొరేషన్‌ను టాటా కొనుగోలు చేసేలా పావులు కదిపింది. ఈ తరుణంలో విస్ట్రాన్‌ కాకుండా.. టాటానే సొంతంగా ఐఫోన్‌ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించేలా యాపిల్‌.. టాటా గ్రూప్‌ను ప్రొత్సహించింది. ఆ చర్చలు చివరి దశకు రావడం.. దేశీయంగా టాటా మరో ఐఫోన్‌ తయారీ ఫ్యాక‍్టరీని ఏర్పాటు చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక హైలెట్‌ చేసింది.

చదవండి👉 యూపీఐ చెల్లింపుల్లో మార్పులు..ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

 
Advertisement
 
Advertisement