పుంజుకున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు | stock market updates on January 7 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: పుంజుకున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు

Jan 7 2025 9:40 AM | Updated on Jan 7 2025 3:34 PM

stock market updates on January 7 2025

మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 177.70 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 78,142.69 పాయిట్ల వద్ద, నిఫ్టీ 81.20 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 23,697.25 వద్ద నిలిచాయి.

ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), SBI లైఫ్ ఇన్సూరెన్స్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, ట్రెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 157 పాయింట్లు లాభపడి 23,775కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 435 పాయింట్లు ఎగబాకి 78,414 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 108.2 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 76 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.55 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 1.2 శాతం ఎగబాకింది.

ఇదీ చదవండి: చాట్‌జీపీటీకి ‘గ్రోక్‌’ స్ట్రోక్‌!

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్‌ బాండ్లపై రాబడులు 4.62 శాతానికి చేరుకోవడంతో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్‌ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్‌ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు తాజాగా భారత్‌లో హెచ్‌ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు చెబుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement