లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు | stock market updates on January 28 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Jan 28 2025 9:37 AM | Updated on Jan 28 2025 9:37 AM

stock market updates on January 28 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 22,904కు చేరింది. సెన్సెక్స్‌ 326 పాయింట్లు ఎగబాకి 75,692 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 107.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 77.14 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.55 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.46 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 3.07 శాతం దిగజారింది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌ అమెజాన్‌లో రూ.102 కోట్ల మోసం

  • అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్‌ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు  పెరిగాయి. 

  • చైనా ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌ ఆర్‌1 ప్రపంచవ్యాప్తంగా టెక్‌ పరిశ్రమను కుదిపేస్తుంది.  అమెరికా దిగ్గజ టెక్‌ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం  మన స్టాక్‌ మార్కెట్‌పై పడింది.    

  • అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి.  

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement