లాభాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు | stock market updates on January 24 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: లాభాల్లో కదలాడుతున్న సూచీలు

Jan 24 2025 9:37 AM | Updated on Jan 24 2025 10:31 AM

stock market updates on January 24 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు లాభపడి 23,241కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 129 పాయింట్లు ఎగబాకి 76,655 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 107.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 78.17 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.53 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.22 శాతం ఎగబాకింది.

ఇదీ చదవండి: రోల్స్‌రాయిస్‌కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్‌

దేశీయ కార్పొరేట్‌ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్‌ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్‌ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్‌(ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్‌బర్గ్‌ ఇటీవల అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం మూలధన పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement