లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు | stock market updates on January 14 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Jan 14 2025 9:36 AM | Updated on Jan 14 2025 4:32 PM

stock market updates on January 14 2025

మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 169.62 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 76,499.63 వద్ద, నిఫ్టీ 121.65 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 23,207.60 వద్ద నిలిచాయి.

అదానీ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Stock Market) ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 135 పాయింట్లు లాభపడి 23,221కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 418 పాయింట్లు ఎగబాకి 76,741 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్‌లో రిలీఫ్‌ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నా​యి. ఈ స్థాయిల్లో మార్కెట్‌ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 109.65 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 80.72 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.76 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.16 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.38 శాతం దిగజారింది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ ఖాళీ

రూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్‌ ఈల్డ్‌లు పెరుగుతున్నాయి. యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్‌ ర్యాలీ ట్రాప్‌లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్‌ దాటి స్థిరపడితేనే పొజిషన్‌ తీసుకోవాలని చెబుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement