నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు | stock market updates on febraury 10 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Feb 10 2025 9:56 AM | Updated on Feb 10 2025 9:56 AM

stock market updates on febraury 10 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు నష్టపోయి 23,419కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 402 పాయింట్లు దిగజారి 77,442 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 108.41 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 75.06 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.95 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 1.36 శాతం దిగజారింది.

ఈ ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టిన రిజర్వ్‌ బ్యాంక్‌ విధాన నిర్ణయాలను శుక్రవారం ప్రకటించింది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. గత 11 సమావేశాల్లో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం నుంచి 6.25కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్‌ రంగ స్థాక్‌లకు కొంత ఊరట కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement