నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు | stock market updates on december 09 2024 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Dec 9 2024 9:35 AM | Updated on Dec 9 2024 3:46 PM

stock market updates on december 09 2024

సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 200.66 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టంతో 81,508.46 వద్ద, నిఫ్టీ 58.80 పాయింట్లు లేదా 0.24 శాతం నష్టంతో 24,619.00 వద్ద నిలిచాయి.

విప్రో, లార్సెన్ & టూబ్రో, ఎస్‌‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో.. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హిందూస్తాన్ యూనీలివర్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 24,674కు చేరింది. సెన్సెక్స్‌ 17 పాయింట్లు దిగజారి 81,682 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.97 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 71.21 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.14 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.25 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.81 శాతం పుంజుకుంది.

దేశీయంగా అక్టోబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్‌ నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు సైతం 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్‌ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement