సాక్షి మనీ మంత్ర : స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఫోకస్‌లో రిలయన్స్‌ | stock market today opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఫోకస్‌లో రిలయన్స్‌

Feb 29 2024 9:34 AM | Updated on Feb 29 2024 10:32 AM

stock market today opening - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు భారీ నష్టాలతో ముగిసిన సూచీలు కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 790 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టంతో క్రాష్‌ అవ్వగా ఈరోజు స్టీడీ అయినట్లు కనిపిస్తోంది.

ట్రేడింగ్‌ ప్రారంభ సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 14.96 పాయింట్లు లేదా 0.021 శాతం నష్టంతో 72,289.92 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29.80 పాయింట్లు లేదా 0.14 శాతం నష్టంతో 21,921.35 వద్ద కొనసాగుతున్నాయి.

రిలయన్స్‌, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాలతో టాప్‌ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, అపోలో హాస్పిటల్‌, ఐషర్‌ మోటర్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టాలతో టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement