సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పెరిగిన మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పెరిగిన మార్కెట్‌ సూచీలు

Mar 7 2024 9:32 AM | Updated on Mar 7 2024 9:33 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 22,490కు చేరింది. సెన్సెక్స్‌ 41 పాయింట్లు పుంజుకుని 74,127 వద్ద ట్రేడవుతోంది.

డాలర్‌ ఇండెక్స్‌ 103.5 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.9 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.11 శాతానికి చేరాయి. 

సెన్సెక్స్‌ 30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాబ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర​్‌టెల్‌ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటమ్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
 

Advertisement
 
Advertisement
Advertisement