సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న స్టాక్‌మార్కెట్లు.. నష్టాలకు బ్రేక్‌ | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న స్టాక్‌మార్కెట్లు.. నష్టాలకు బ్రేక్‌

Mar 14 2024 3:30 PM | Updated on Mar 14 2024 3:32 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 22,151కు చేరింది. సెన్సెక్స్‌ 335 పాయింట్లు పుంజుకుని 73,097 వద్ద ట్రేడింగ్‌ ముగించాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, భారతి ఎయిర్‌టెల్‌, ఎం అండ్‌ ఎం, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, నెస్లే, ఏషియన్‌ పెయింట్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటక్‌మహీంద్రా బ్యాంక్‌ కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి.

యాక్సిస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా ‍స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement