సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు

Feb 26 2024 3:38 PM | Updated on Feb 26 2024 3:39 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్‌ ముగింపు సమయానికి నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 22,115 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 354 పాయింట్లు దిగజారి 72,788 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌ అండ్‌ టీ, పవర్‌గ్రిడ్‌, హెచయూఎల్‌ మినహా అన్ని స్టాక్‌లు నష్టాల్లోకి చేరుకున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, టాటాస్టీల్‌, టైటాన్‌, టెక్‌మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ భారీగా నష్టపోయాయి.

అమెరికా మార్కెట్లు గడిచిన మార్కెట్‌ సెషన్‌లో రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. టెక్‌ స్టాక్స్‌లో అమ్మకాలు, యూరోజోన్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో నేడు ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు ప్రతికూలంగా ట్రేడైనట్లు తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 81.22 అమెరికన్‌ డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎఫ్‌ఐఐలు శుక్రవారం నికరంగా రూ.1,276.09 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.176.68 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement