ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు | Stock Market opening Rally On October 04 2024 | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Oct 4 2024 10:05 AM | Updated on Oct 4 2024 10:57 AM

Stock Market opening Rally On October 04 2024

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:57 సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 25,274కు చేరింది. సెన్సెక్స్‌ 83 పాయింట్లు పుంజుకుని 82,575 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 102 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 74 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.84 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.17 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.04 శాతం దిగజారింది.

ఇదీ చదవండి: మార్కెట్‌ కల్లోలానికి కారణాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్‌ తదితర దేశాలతో భారత్‌ వాణిజ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కల్లోల పరిస్థితుల్లో, పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల భారత్‌ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు భారత్‌ నుంచి ఎగుమతులు 63.5 శాతం తగ్గిపోయాయని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. జోర్డాన్‌కు 38.5 శాతం క్షీణించాయని తెలిపాయి. లెబనాన్‌కు సైతం 6.8 శాతం తగ్గాయని చెప్పాయి. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య యుద్ధం మొదలు కాగా, అది ఇప్పుడు లెబనాన్, సిరియాకు విస్తరించిందని.. ప్రత్యక్షంగా జోర్డాన్, ఇరాన్‌పైనా ప్రభావం చూపిస్తున్నట్టు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement