నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు | Stock Market opening Rally on November 13th 2024 | Sakshi
Sakshi News home page

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Nov 13 2024 9:40 AM | Updated on Nov 13 2024 9:51 AM

Stock Market opening Rally on November 13th 2024

బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 78,507.87 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 23,820 వద్ద ఉన్నాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 16 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా, టాటా స్టీల్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా నష్టాలలో ముందుండగా, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, భారతి ఎయిర్‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి.

ఇక నిఫ్టీ 50 షేర్లలో 31 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాభాల్లో ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ ముందుండగా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, హీరోమోటోకో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నష్టాల్లో ముందున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement