సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Closing Today Rally | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Apr 26 2024 3:30 PM | Updated on Apr 26 2024 3:30 PM

Stock Market Closing Today Rally

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 22,452 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 443 పాయింట్లు దిగజారి 73,896 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌మహీంద్రా, విప్రో, ఐటీసీ, టైటాన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి.

బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌, సన్‌ఫార్మా, టాటీ స్టీల్‌, ఎన్‌టీపీసీ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement