స్కోడా ఆటో ఇండియా.. కుషాక్ ధరలను పెంచింది. ఈ ఏడాది మే నెలలో ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదలైన తర్వాత ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీకి ధర పెంపు ఇదే మొదటిసారి. హ్యుందాయ్ క్రెటాకు పోటీగా ఉన్న ఈ కారు ధర ఇప్పుడు రూ. 20,000 వరకు పెరిగింది.
స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లోని.. ప్రెస్టీజ్ 1.0 ఏటీ, మాంటే కార్లో 1.0 ఏటీ, ప్రెస్టీజ్ 1.5 డీసీటీ, మాంటే కార్లో 1.5 డీసీటీ వేరియంట్ల ధరలు ఒక్కొక్కదానికి రూ. 20,000 చొప్పున పెరిగాయి. అదే విధంగా.. ప్రెస్టీజ్ 1.0 ఎంటీ, స్పోర్ట్‌లైన్ 1.0 ఏటీ, స్పోర్ట్‌లైన్ 1.0 ఎంటీ, క్లాసిక్ ప్లస్ 1.0 ఏటీ వేరియంట్ల ధరలు ఒక్కొక్కదానికి రూ. 15,000 చొప్పున పెరిగాయి.
ఇక 2026 కుషాక్ సిగ్నేచర్ 1.0 ఏటీ, సిగ్నేచర్ 1.0 ఏంటీ వేరియంట్ల ధరలు రూ.10వేలు పెరిగాయి. అయితే.. క్లాసిక్+ 1.0 ఏంటీ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దీని ధర ఇప్పుడు రూ. 10.69 లక్షల నుంచి రూ. 19.19 లక్షల మధ్య ఉంది (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). కంపెనీ ధరలు పెంచినప్పటికీ.. కారులో ఎలాంటి అప్డేట్స్ లేదు.
ఇదీ చదవండి: 2026 ఫార్చ్యూనర్ లాంచ్: ధర ఎంతో తెలుసా?


