ఎస్‌ఈటీఎల్‌ లాభం రూ. 27 కోట్లు | SETL Q1 FY27 Results: Net Profit Rises 27% to Rs 27 Cr; Revenue Up 41% | Sakshi
Sakshi News home page

ఎస్‌ఈటీఎల్‌ లాభం రూ. 27 కోట్లు

Aug 7 2026 2:31 AM | Updated on Aug 7 2026 11:49 AM

SETL Reports Record Q1 FY27 Results

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ (ఎస్‌ఈటీఎల్‌) రూ. 27 కోట్ల లాభం ప్రకటించింది. గత క్యూ1తో పోలిస్తే ఇది దాదాపు 27 శాతం అధికం. ఆదాయం 41 శాతం పెరిగి రూ. 252 కోట్లకు చేరింది.

 కొత్త విభాగాల్లో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తూ కూడా పటిష్ట పనితీరు చూపినట్లు సంస్థ తెలిపింది.  ఇంజనీరింగ్‌ వ్యాపారం ఈ ఏడాది 40–50 శాతం వృద్ధి చెందనుండగా, జీస్కేల్‌ విభాగం తొలి ఏడాది దాదాపు రూ. 250 కోట్ల మేర ఆదాయాన్ని అందించవచ్చని అంచనా వేస్తున్నట్లు సంస్థ వివరించింది. 

దేశీయంగా హై ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ పవర్‌హౌస్‌గా ఎస్‌ఈటీఎల్‌ ఎదుగుతోందని కంపెనీ ఎండీ నాగేశ్వరరావు కందుల తెలిపారు. ప్రధానమైన ఇంజినీరింగ్‌ వ్యాపారాన్ని బలోపేతం చేసుకుంటూనే ఏఐ డేటా సెంటర్‌ తయారీ దిగ్గజంగా ఎదగడం, జీఎల్‌ హక్కో భాగస్వామ్యంతో అంతర్జాతీయంగా మరిన్ని కొత్త మార్కెట్లలోకి విస్తరించడంపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. విస్తరణ కోసం ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ ద్వారా రూ. 136.5 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement