డెట్‌ ఇష్యూల్లో రూ.5 లక్షల వరకు పెట్టుబడులకు యూపీఐ

SEBI increase public debt investment limit vai UPI upto Rs 5 lakh - Sakshi

మే 1 నుంచి అమల్లోకి 

న్యూఢిల్లీ: రిటైల్‌ ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా డెట్‌ సెక్యూరిటీల పబ్లిక్‌ ఇష్యూల్లో ఇక మీదట రూ.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2లక్షల వరకే ఉంది. మే 1 నుంచి ప్రారంభమయ్య డెట్‌ ఇష్యూలకు నూతన నిబంధన అమలు కానుంది. ఈ మేరకు సెబీ ఆదేశాలు జారీ చేసింది. 

ప్రస్తుతం రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ.2లక్షల వరకు పెట్టుబడికి యూపీఐ ఆధారిత ‘బ్లాక్‌ ఫండ్స్‌’ ఆప్షన్‌తో డెట్‌ ఇష్యూల్లో పాల్గొనేందుకు అనుమతి ఉంది. అంటే ఆయా నిధులు బ్యాంకు ఖాతాల్లోనే ఉండి ఇష్యూ అలాట్‌మెంట్‌ ముగిసే వరకు బ్లాక్‌లో ఉంటాయి. సెక్యూరిటీలు కేటాయిస్తే ఆ మేరకు పెట్టుబడి మొత్తం డెబిట్‌ అవుతుంది. లేదంటే ఖాతాలోనే అన్‌బ్లాక్‌ అవుతాయి. పెట్టుబడులు సులభంగా మార్చేందుకు భాగస్వాములతో సంప్రదించిన మీదట ఈ పరిమితిని రూ.5లక్షలకు పెంచుతున్నట్టు సెబీ తెలిపింది. దీంతో బ్లాక్‌ ఫండ్స్‌ ఆప్షన్‌తో రూ.5లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని పేర్కొంది.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top