ఎస్‌బీఐ రూ.746 కోట్ల ఎన్‌పీఏల వేలం | Sbi Auction Of Npas Of Rs 746 Crore In October And November | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ రూ.746 కోట్ల ఎన్‌పీఏల వేలం

Oct 10 2022 8:40 AM | Updated on Oct 10 2022 11:32 AM

Sbi Auction Of Npas Of Rs 746 Crore In October And November - Sakshi

న్యూఢిల్లీ: ఎంతకీ వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) ఎస్‌బీఐ వరుసగా ఈ నెల, వచ్చే నెలలో వేలం వేయనుంది. సింటెక్స్‌ బీఏపీఎల్‌ మోసపూరిత రుణ ఖాతాను కూడా విక్రయానికి పెట్టనుంది. తద్వారా రూ.746 కోట్లను వసూలు చేసుకోనుంది. 

ముందుగా నవంబర్‌ 4న ఎస్‌బీఐ పలు ఎన్‌పీఏ ఖాతాలను వేలం వేయనుంది. సింటెక్స్‌ బీఏపీఎల్‌ రూ.198 కోట్లు, సూరత్‌ హజీరా ఎన్‌హెచ్‌6 టోల్‌వే ప్రైవేటు లిమిటెడ్‌ రూ.335 కోట్లు, శ్రీభావ్‌ పాలీవేవ్స్‌ రూ.20 కోట్ల ఎన్‌పీఏలు వేలం జాబితాలో ఉన్నాయి. సింటెక్స్‌ బీఏపీఎల్‌ ఖాతాకు కేవలం అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలే (ఏఆర్‌సీలు) అర్హులని ఎస్‌బీఐ పేర్కొంది.    
 

Advertisement
 
Advertisement
Advertisement