రోజువారీ ఖర్చుల కోసం మీరు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంటే, ఈ ఆఫర్ మీకోసమే! ప్రైవేట్ రంగానికి చెందిన డీసీబీ బ్యాంక్ (DCB Bank) తన హ్యాపీ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. హ్యాపీ సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా చేసే యూపీఐ లావాదేవీలపై కస్టమర్లు నెలకు రూ .625 వరకు, సంవత్సరానికి రూ .7,500 వరకు సంపాదించవచ్చు.
క్యాష్ బ్యాక్ ఎలా పొందాలంటే..
ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవడానికి, మీరు డీసీబీ బ్యాంక్లో హ్యాపీ సేవింగ్స్ ఖాతాను తెరవాలి. తరువాత ఈ ఖాతాలోని మొత్తాన్ని ఉపయోగించి యూపీఐ ద్వారా (డెబిట్ లావాదేవీలు) చేసే చెల్లింపులపై బ్యాంకు ప్రతి త్రైమాసికం లేదా మూడు నెలలకోసారి క్యాష్ బ్యాక్ను మీ ఖాతాలో జమచేస్తుంది.
నిబంధనలు, ప్రయోజనాలు
ఖాతాలో కనీసం రూ.10,000 సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) నిర్వహించడం తప్పనిసరి.
క్యాష్ బ్యాక్ కు అర్హత సాధించడానికి, సగటు త్రైమాసిక బ్యాలెన్స్ (AQB) రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
కనీస లావాదేవీ మొత్తం రూ. 500.
ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ లావాదేవీలు ఉచితం.
డీసీబీ బ్యాంక్ ఏటీఎం నుంచి అపరిమిత ఉచిత లావాదేవీలు
యూపీఐ అంటే..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)అనేది ఒక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దీంతె మీ మొబైల్ ఫోన్ ద్వారా రోజులో 24 గంటలు, వారానికి 7 రోజులు తక్షణం డబ్బును పంపడం లేదా స్వీకరించడం సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. యూపీఐ ద్వారా మీ బ్యాంకు ఖాతాను గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ వంటి యాప్‌లతో అనుసంధానం చేయవచ్చు.


