సెయిల్‌ సీఎండీగా ఏకే పాండా బాధ్యతలు | SAIL Appoints Ashok Kumar Panda as new Chairman and Managing Director | Sakshi
Sakshi News home page

సెయిల్‌ సీఎండీగా ఏకే పాండా బాధ్యతలు

May 10 2026 5:41 AM | Updated on May 10 2026 5:41 AM

SAIL Appoints Ashok Kumar Panda as new Chairman and Managing Director

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టరుగా అశోక్‌ కుమార్‌ పాండా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు ఆయన ఫైనాన్స్‌ డైరెక్టరుగా వ్యవహరించారు. ఏప్రిల్‌ 1తో పదవీకాలం ముగిసిన అమరేందు ప్రకాశ్‌ స్థానంలో ఆయన నియమితులయ్యారు. 1992లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా (టెక్నికల్‌) సెయిల్‌లో పాండా కెరియర్‌ ప్రారంభించారు. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 35 మిలియన్‌ టన్నులకు పెంచుకునే దిశగా తదుపరి దశ విస్తరణ పనులు యథాప్రకారం కొనసాగుతున్నాయని పాండా తెలిపారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement