breaking news
new Chairman and Managing Director
-
సెయిల్ సీఎండీగా ఏకే పాండా బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా అశోక్ కుమార్ పాండా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు ఆయన ఫైనాన్స్ డైరెక్టరుగా వ్యవహరించారు. ఏప్రిల్ 1తో పదవీకాలం ముగిసిన అమరేందు ప్రకాశ్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. 1992లో మేనేజ్మెంట్ ట్రైనీగా (టెక్నికల్) సెయిల్‌లో పాండా కెరియర్ ప్రారంభించారు. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 35 మిలియన్ టన్నులకు పెంచుకునే దిశగా తదుపరి దశ విస్తరణ పనులు యథాప్రకారం కొనసాగుతున్నాయని పాండా తెలిపారు -
హెచ్‌పీసీఎల్ కొత్త సీఎండీ ఎం కే సురన
న్యూఢిల్లీ: దేశీ మూడవ అతి పెద్ద అయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కొత్త సీఎండీగా ఎం.కె.సురన నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ అనుబంధ కంపెనీ ప్రైజ్ పెట్రోలియం కార్పొరేషన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుత హెచ్‌పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ పదవీ కాలం మార్చి నెలతో ముగియనుంది. హెచ్‌పీసీఎల్ సీఎండీగా సురన ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు చేపడతారు. పదవీకాలం ఐదేళ్లు.


