Sakshi News home page

రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన

Published Tue, Aug 15 2023 5:21 PM

Russian central bank lifts rates by 350 basis points to12pc - Sakshi

రష్యా  సెంట్రల్ బ్యాంక్ సంచలన నిర్ణయం  తీసుకుంది. ఆ దేశ కరెన్సీ రూబుల్‌ కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో కీలక వడ్డీరేట్లను భారీగా పెంచేసింది.  12 శాతం లేదా 350 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేటు పెంపును మంగళవారం ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దేశం కరెన్సీ  విలువ దిగజారిపోవడం, ద్రవ్యోల్బణంపై పోరులో భాగంగా అత్యవసర చర్యకు ఉపక్రమించింది. తద్వారా రూబుల్‌ను బలోపేతం చేయాలని భావిస్తోంది. 

యుద్ధం , ఆంక్షలు పరిష్కారం కానంతవరకు
గతంలో 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను ఏకంగా 12 శాతానికి పెంచుతున్నట్లు రష్యా సెంట్రల్ బ్యాంక్ మంగళవారం వెల్లడించింది.రష్యన్ కరెన్సీ సోమవారం డాలర్‌తో  పోలిస్తే రూబుల్ 102 మార్కు వద్ద 16 నెలల కనిష్టానికి చేరడంతో ఈ కఠిన చర్యలకుది గింది.  సంవత్సరం ప్రారంభం నుండి దాని విలువలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కోల్పోయింది .దాదాపు 17 నెలల్లో కనిష్ట స్థాయిని తాకింది. గత మూడు నెలల్లో ద్రవ్యోల్బణం 7.6 శాతానికి చేరుకుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందని, ఇది రూబుల్ పతనం ప్రమాదాన్ని పెంచుతుందని అంచనా వేస్తూ, గత నెలలో 1 శాతం  మేర వడ్డీరేటును పెంచింది. వడ్డీ రేట్లపై దాని తదుపరి సమావేశం సెప్టెంబర్ 15న జరగనుంది.ఒక్కసారిగా కీలక వడ్డీ రేట్లను 350 బేసిస్ పాయింట్లు పెంచటంపై ప్రపంచ ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్లోబల్‌ మార్కెట్లను ప్రభావితం చేస్తుందని  భావిస్తున్నారు. 

లండన్‌లోని బ్లూబే అసెట్ మేనేజ్‌మెంట్‌లో సీనియర్ ఎమర్జింగ్ మార్కెట్‌ల సావరిన్ స్ట్రాటజీ తిమోతీ యాష్ స్పందన:  యుద్ధం కొనసాగుతున్నంత కాలం రష్యా, రష్యా ఆర్థిక వ్యవస్థ,  రూబుల్‌కు మరింత దిగజారుతుంది. హైకింగ్ పాలసీ రేట్లు దేనినీ పరిష్కరించని వ్యాఖ్యానించారు. రూబుల్ తరుగుదల వేగాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు కానీ ప్రధాన సమస్య అయిన యుద్ధం , ఆంక్షలు  పరిష్కరించుకోవాలన్నారు.

లండన్‌లోని ఈక్విటీ క్యాపిటల్‌లో చీఫ మాక్రో ఎకనామిస్ట్ స్టువర్ట్ కోల్ ఏమన్నారంటే..రూబుల్ విలువ పతనానికి ఇది అత్యవసర ప్రతిస్పందన.కరెన్సీ పతనం ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉంది.ఇది ఉక్రెయిన్ దాడి ఖర్చుల గురించి రష్యన్ ప్రజలకు పంపే సంకేతమన్నారు. యుద్ధం కారణంగా సైనిక వ్యయం పెరిగిపోవడం, రష్యా వాణిజ్య సమతుల్యతపై పాశ్చాత్య ఆంక్షల ప్రభావం, ద్రవ్యోల్బణం లాంటి  కారణాలతో రష్యా కేంద్ర బ్యాంకు  రేటు పెంపు  నిర్ణయం తాత్కాలిక పరిష్కారమే. రూబుల్ పతనం, ఇంధన ధరలు, ఎగుమతి ఆదాయాలు క్షీణించడంతో పాటు వస్తువుల దిగుమతులు వేగంగా పుంజుకోవడం వల్ల కరెంట్ ఖాతా మిగులు బాగా తగ్గిపోయిందని ఆర్థిక వేత్తలంటున్నారు. అంతేకాదు తాజా రేట్ల పెంపు ఇండియా చెల్లింపులను కూడా ప్రభావితం చేయవచ్చని అంచనా. ఈ ప్రభావం  ఆసియా స్టాక్‌మార్కెట్లతోపాటు, భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపి నష్టాలకు దారితీయెుచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై దాడి   నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత, రూబుల్ డాలర్‌తో పోలిస్తే 130కి పడిపోయింది, అయితే సెంట్రల్ బ్యాంక్ దాని కీలక వడ్డీ రేటును 20శాతం వరకు పెంచి మూలధన నియంత్రణలను అమలులోకి తెచ్చింది. ఆ తర్వాత నెలరోజుల్లో రేట్లను తగ్గించి కరెన్సీ విలువను స్థిరీకరించే ప్రయత్నాలు చేసింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement