రూపాయి మరో 17 పైసలు డౌన్‌ | Rupee falls 17 paise to close at 95. 36 against US dollar | Sakshi
Sakshi News home page

రూపాయి మరో 17 పైసలు డౌన్‌

Jun 3 2026 4:32 AM | Updated on Jun 3 2026 4:32 AM

Rupee falls 17 paise to close at 95. 36 against US dollar

95.36 వద్ద ముగింపు 

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం 17 పైసలు బలహీ నపడి 95.36 వద్ద ముగిసింది. క్రూడాయిల్‌ ధరలు ఎగసిపడటం, పెద్ద ఎత్తున పెట్టుబడులు సురక్షిత పెట్టుబడి సాధనాల వైపు మళ్లడంతో అమెరికా డాలర్‌ బలంగా కొనసాగింది.

మరోవైపు దేశీయ మా ర్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగింది. ఈ పరిణామాలు భారత కరెన్సీ కోతకు కారణమయ్యాయి. రూపాయి బలహీనపడటం వరుసగా రెండో రోజు ఇది. మరోవైపు మార్కెట్‌ వర్గాల దృష్టి జూన్‌ 3–5 తేదీల్లో జరగనున్న ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంపై కేంద్రీకృతమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement