రోల్స్ రాయిస్ కొత్త ఎడిషన్ - కేవలం 25 మందికి మాత్రమే! | Sakshi
Sakshi News home page

రోల్స్ రాయిస్ కొత్త ఎడిషన్ - కేవలం 25 మందికి మాత్రమే!

Published Sat, Oct 14 2023 6:59 PM

Rolls Royce Special Edition Inspired By Solar Eclipse - Sakshi

గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'రోల్స్ రాయిస్' (Rolls Royce) ఇటీవల ఘోస్ట్ సెలూన్ అనే కొత్త లిమిటెడ్ ఎడిషన్ కారుని లాంచ్ చేసింది. దీనినే కంపెనీ 'బ్లాక్ బ్యాడ్జ్ ఎక్లీప్సిస్' అని పిలుస్తోంది. ఈ కొత్త ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొత్త రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ ఎక్లీప్సిస్ ఎడిషన్ కేవలం 25 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ లగ్జరీ కారు ఇంటిగ్రేటెడ్ పౌడర్ కాపర్ పిగ్మెంట్‌తో కూడిన కస్టమ్ లిరికల్ కాపర్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్ పొందుతుంది.

వైట్ కలర్ అల్లాయ్ వీల్స్, కలర్‌ఫుల్ బ్రేక్ కాలిపర్లు కలిగిన ఈ కారు లేటెస్ట్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఫీచర్స్ పొందుతుంది. లోపల స్టార్‌లైట్ హెడ్‌లైనర్‌ను ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. ఇది సూర్యగ్రహణాన్ని కాపీ చేసే కస్టమ్ యానిమేషన్‌ను కలిగి ఉంది. డాష్‌బోర్డ్ టైమ్‌పీస్‌లో 0.5 క్యారెట్ డైమండ్ కూడా ఉంది.

ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్ జాబ్.. రూ.3 కోట్లు వేతనం - అయినా వదిలేశాడు! కారణం తెలిస్తే..

రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ 6.7 లీటర్ ట్విన్ టర్బో వీ12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 1600 ఆర్‌పీఎమ్‌ వద్ద 563 హార్స్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ (రూ. 6.95 నుంచి రూ. 7.95 కోట్లు) కంటే ఎక్కువ ఉంటుందని అంచనా.

 
Advertisement
 
Advertisement