
టెస్లా లాస్ ఏంజిల్స్‌లో టెక్నాలజీని మిళితం చేస్తూ వినియోగదారులకు సరికొత్త డైనర్, డ్రైవ్-ఇన్ అనుభవాన్ని అందించాలని కొత్త అవుట్‌లెట్‌ను ఆవిష్కరించింది. శాంటా మోనికా బౌలేవార్డ్‌లో టెస్లా టెక్ ఔత్సాహికులతోపాటు సాధారణ ప్రజలకు సాంకేతికత సాయంతో ఫుడ్ సర్వీసులు ప్రారంభించింది. క్లాసిక్ కంఫర్ట్ ఫుడ్‌ను ఈ అవుట్‌లెట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు టెస్లా తెలిపింది.
టెక్ కంటెంట్ సృష్టికర్త జాక్లిన్ డల్లాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డైనర్ కేవలం ఒక హోటల్‌గా మాత్రమే కాకుండా 45 అడుగుల స్క్రీన్ అమర్చిన డ్రైవ్ ఇన్ థియేటర్ అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు. ఇందులో బర్గర్లు, హాట్ డాగ్స్, చికెన్ వింగ్స్ హ్యాండ్ స్పిన్డ్ మిల్క్ షేక్స్ లభిస్తాయన్నారు. అయితే కస్టమర్లు చేసే ఆర్డర్లు అన్నీ టెస్లా సైబర్ ట్రక్ థీమ్ బాక్స్‌ల్లో అందిస్తారని తెలిపారు.
My kids ❤️ @Tesla_Optimus #TeslaDiner pic.twitter.com/Kt6t8gsHOL
— Prime the pump (@whistingbhole) July 20, 2025
ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో భారీగా కొలువుల కోతలు
ఈ టెస్లా డైనర్‌లో భోజనం చేయాలనుకునే కస్టమర్లు కార్లలోని టెస్లా స్క్రీన్ల నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా ఆడియో సింక్ చేయడం ద్వారా అయినా ఆర్డర్ బుక్ చేయవచ్చు. ఇందులో సర్వీసు చేసేందుకు టెస్లా ఆప్టిమస్ రోబోట్‌లను వినియోగిస్తున్నట్లు డల్లాస్ చెప్పారు. దాంతోపాటు టెస్లా కార్లు ఛార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2023 చివరిలో ప్రారంభమైంది.
Inside @Tesla ‘s NEW Diner!! pic.twitter.com/yOPdQEEXwZ
— Jacklyn Dallas (@NBTJacklyn) July 20, 2025