breaking news
diners
-
టెస్లా డైనర్ రెస్టారెంట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలు
టెస్లా లాస్ ఏంజిల్స్‌లో టెక్నాలజీని మిళితం చేస్తూ వినియోగదారులకు సరికొత్త డైనర్, డ్రైవ్-ఇన్ అనుభవాన్ని అందించాలని కొత్త అవుట్‌లెట్‌ను ఆవిష్కరించింది. శాంటా మోనికా బౌలేవార్డ్‌లో టెస్లా టెక్ ఔత్సాహికులతోపాటు సాధారణ ప్రజలకు సాంకేతికత సాయంతో ఫుడ్ సర్వీసులు ప్రారంభించింది. క్లాసిక్ కంఫర్ట్ ఫుడ్‌ను ఈ అవుట్‌లెట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు టెస్లా తెలిపింది.టెక్ కంటెంట్ సృష్టికర్త జాక్లిన్ డల్లాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డైనర్ కేవలం ఒక హోటల్‌గా మాత్రమే కాకుండా 45 అడుగుల స్క్రీన్ అమర్చిన డ్రైవ్ ఇన్ థియేటర్ అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు. ఇందులో బర్గర్లు, హాట్ డాగ్స్, చికెన్ వింగ్స్ హ్యాండ్ స్పిన్డ్ మిల్క్ షేక్స్ లభిస్తాయన్నారు. అయితే కస్టమర్లు చేసే ఆర్డర్లు అన్నీ టెస్లా సైబర్ ట్రక్ థీమ్ బాక్స్‌ల్లో అందిస్తారని తెలిపారు.My kids ❤️ @Tesla_Optimus #TeslaDiner pic.twitter.com/Kt6t8gsHOL— Prime the pump (@whistingbhole) July 20, 2025ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో భారీగా కొలువుల కోతలుఈ టెస్లా డైనర్లో భోజనం చేయాలనుకునే కస్టమర్లు కార్లలోని టెస్లా స్క్రీన్ల నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా ఆడియో సింక్ చేయడం ద్వారా అయినా ఆర్డర్ బుక్ చేయవచ్చు. ఇందులో సర్వీసు చేసేందుకు టెస్లా ఆప్టిమస్ రోబోట్లను వినియోగిస్తున్నట్లు డల్లాస్ చెప్పారు. దాంతోపాటు టెస్లా కార్లు ఛార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2023 చివరిలో ప్రారంభమైంది.Inside @Tesla ‘s NEW Diner!! pic.twitter.com/yOPdQEEXwZ— Jacklyn Dallas (@NBTJacklyn) July 20, 2025 -
నగ్న రెస్టారెంటులో ఊబకాయులకు నో ఎంట్రీ!
భోజనప్రియుల కోసం టోక్యోలో కొత్త కాన్సెప్ట్ తో ప్రారంభం కానున్న నగ్న రెస్టారెంట్ (నేకెడ్ రెస్టారెంట్) అతిథులకు కొన్ని నిబంధనలను విధించింది. విభిన్న రుచులతో రెస్టారెంట్ లో భోజనం చేయాలని ఉవ్విల్లూరే వారికి నగ్నంగా భోజనం చేసే సదుపాయం అందిస్తున్న రెస్టారెంట్... తమ నిబంధనల ప్రకారం ఊబకాయులకు అనుమతి నిరాకరిస్తోంది. సరికొత్త డైనింగ్ అనుభవాలను పొందాలనుకుంటే తమ వెబ్ సైట్ లోని నియమాల జాబితాను తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనని నిక్కచ్చిగా చెప్తోంది. టోక్యోలో ప్రారంభం కానున్న జపనీస్ నేకెడ్ రెస్టారెంట్ వినియోగదారులకు కఠిన నిబంధనలను విధిస్తోంది. ముఖ్యంగా ఊబకాయులకు ప్రవేశాన్ని నిషేధించడంతోపాటు, వయో నిబంధనలను కూడ అమలుచేస్తోంది. రెస్టారెంట్ విధించిన నిబంధనల ప్రకారం వయసుతోపాటు బరువును కూడా పాటించగలిగే వారే అక్కడ నగ్నంగా భోజనం చేసే అవకాశం పొందుతారు. లండన్, మెల్బోర్న్ సంస్థలను అనుసరిస్తూ.. కేవలం 16 - 60 ఏళ్ల మధ్య వయస్కులనే అనుమతించడంతోపాటు... వచ్చిన వారి బట్టలను చెక్ చేసి, పేపర్లో ఉంచి వారికి ప్రత్యేకమైన అండర్ వేర్‌ను అందిస్తోంది. అందుకు సంబంధించిన నియమ నిబంధనల లిస్టును స్టేట్స్ రెస్టారెంట్స్ వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. నగ్న రెస్టారెంట్ ను సందర్శించి అక్కడి భోజనాన్ని ఆస్వాదించాలనుకునేవారు వెబ్ సైట్ లోని నియమాల జాబితాను ఫాలో అవ్వక తప్పదని నిర్వాహకులు చెప్తున్నారు. భోజనానికి వచ్చిన వారిని అక్కడికక్కడే బరువును చూసి మరీ లోపలకు అనుమతిస్తారు. ఒకవేళ నిబంధనకు మించి బరువు ఎక్కువగా ఉంటే బయటకు పంపించేందుకు ఏమాత్రం వెనుకాడే పనిలేదని నిర్వాహకులు కచ్చితంగా చెబుతున్నారు. జూలై 29న ప్రారంభం కానున్న నేకెడ్ రెస్టారెంట్ కు సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్ పేజిలోనే ముందుగా అన్ని రకాల చెల్లింపులు చేసి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని, మొత్తం డబ్బును అడ్వాన్స్ గా చెల్లించిన తర్వాత రెస్టారెంటుకు వచ్చిన తర్వాత బరువు ఎక్కువగా ఉన్నవారిని బయటకు పంపడమే కాక, డబ్బును తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. అప్పటికే ఉన్న అతిథులను నియమాల జాబితా గురించి అడగటం, వారిని విసిగించడం, సందర్శకులను ముట్టుకునేందుకు ప్రయత్నించడం చేస్తే... అలాంటివారి ప్రవేశాన్ని నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే వచ్చిన అతిథుల మొబైల్ ఫోన్లు, కెమెరాలను వారికి దూరంగా టేబుల్ టాప్ బాక్స్ లో భద్రపరుస్తారు. త్వరలో ప్రారంభానికి సిద్ధమౌతున్న నేకెడ్ రెస్టారెంటులో ప్రవేశ టికెట్ ఖరీదు దాదాపు రూ. 50 వేలు. దీన్ని ముందుగా వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలి. ఇలా రెస్టారెంట్ కు వచ్చిన అతిథులకు... జీ స్ట్రింగ్స్ ధరించిన కండల వీరులు భోజనాన్ని వడ్డిస్తారు. కావలసిన రుచులను ఆస్వాదిస్తూ... మేల్ మోడల్స్ చేసే కనువిందైన డ్యాన్స్ షోను తిలకించే అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తారు. అయితే నృత్య ప్రదర్శన చూడాలనుకున్నవారు భోజనం టికెట్ కాక, డ్యాన్స్ షో టికెట్ ను వారి వారి ఇష్టాన్ని బట్టి మెనూలో ఎంపిక చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. -
చైనాలో జుగుప్సాకరమైన వీడియో బయటకు
బీజింగ్: చైనాలో ఓ జుగుప్సకరమైన వీడియో బయటపడింది. మాంసాహారులు కూడా అసహ్యించుకునేలా ఆ వీడియో ఉంది. బతికున్న చేపపిల్లలను కొందరు వ్యక్తులు ఫుల్లుగా మధ్యం సేవించి బతికుండగానే లాగించేశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లోకి అడుగుపెట్టడంతో పలువురు వారి తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ఏం ఉందంటే.. బీజింగ్ పట్టణంలోని ఓ నివాసంలో కొంతమంది వ్యక్తులు పార్టీ చేసుకునేందుకు వచ్చారు. పార్టీలో భాగంగా మధ్యం తెచ్చుకున్నారు. అందులోకి సాస్ లాంటిదాన్ని కూడా తయారుచేసుకున్నారు. అయితే, దానిపక్కనే బతికున్న చేపలతో ఉన్న నీటి పాత్రను పెట్టారు. ఇక అనంతరం ఒక్కొక్క సిప్ వేసుకుంటూ గొళ్లున నవ్వుకుంటూ ఆ బతికున్న చేపలను ఆ ఫ్రైసాస్లో పడేసి అవి ప్రాణం కోసం కొట్టుకుంటుండగానే స్పూన్‌తో నోట్లో వేసుకొని కరకర నమిలేస్తూ గుట్టుక్కుమని మింగేస్తున్నారు. ఇది కాస్త ఆన్ లైన్ లో అడుగుపెట్టి పలువురి ఆగ్రహానికి గురవుతుంది. అయితే, ఇలా బతికున్న చేపలు తింటున్న వీడియోలు బయటకు రావడం ఇదే తొలిసారేం కాదని, తూర్పు ఆసియా ప్రాంతంలో సర్వసాధరణం అని చెప్తున్నారు. కానీ, జంతుప్రేమికులు, మానవతావాదులు ఈ చర్యలను ఖండిస్తున్నారు.