రెడ్‌మీ నోట్‌ 12 5జీపై భారీ డిస్కౌంట్‌, రూ.12,999కే కొనుగోలు చేయొచ్చు!

Redmi Note 12 5g Now Available Cashback Offers, Exchange Bonus - Sakshi

ఈ ఏడాది జనవరిలో విడుదలైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మీ నోట్‌ 12 5జీ ఫోన్‌పై ప్రముఖ ఫోన్‌ తయారీ సంస్థ  షావోమీ భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. వీటితో పాటు రెడ్‌మీ నోట్‌ 12ప్రో 5జీ, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో ప్లస్‌ 5జీ రేట్లను సవరించింది. అమెజాన్‌, ఎంఐ.కామ్‌ డిస్కౌంట్‌లలో ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. 

విడుదల సమయంలో రెడ్‌మీ నోట్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ ర్యామ్‌ ప్లస్‌ 128 స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ.17,999 ఉండగా.. తాజాగా ఆఫోన్‌ ధరను వెయ్యిరూపాయలు తగ్గించింది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.2,000 వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆ ఫోన్‌ ధర రూ.14,999కే తగ్గుతున్నట్లు షావోమీ కంపెనీ పేర్కొంది. 

కొనుగోలు దారులు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక, ఐసీఐసీఐ నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస‍్తే రూ.2,000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌, మరో రెండు వేలు ఎక్ఛేంజ్‌ బోనస్‌ను పొందవచ్చు. ఇలా రూ.17,999 ఉన్న ఫోన్‌ ధర రూ.12,999కి తగ్గుతుంది. 

అలాగే, 6జీబీ ర్యామ్‌ ప్లస్‌ 128 జీబీ స్టోరేజ్‌ మోడల్‌ రెడ్‌మీ నోట్‌ 12 5జీ ధర రూ.18,999 ఉండగా 8జీబీ ర్యామ్‌ ప్లస్‌ 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.20,999గా ఉంది. ఇప్పుడు ఆ రెండు వేరియంట్‌ ఫోన్‌ ధరల్ని షావోమీ తగ్గించడంతో బ్యాంక్‌ డిస్కౌంట్‌తో కలిపి రూ.16,999, 18,999కే లభిస్తుంది.  

రెడ్‌మీ నోట్‌ 12 5జీ స్పెసిఫికేషన్‌లు
రెడ్‌మీ నోట్‌ 12 5జీ (1,080*2,400) పిక్సెల్స్‌తో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 5000 ఏఎంహెచ్‌ బ్యాటరీ, క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4జెనరేషన్‌ 1 ఎస్‌ఓఎస్‌, 48 మెగాపిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌, 13 మెగా పిక్సెల్‌ సెల్ఫీ సెన్సార్‌, 128 జీబీ స్టోరేజ్‌, 33 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’.. అశ్నీర్‌ గ్రోవర్‌ దంపతులకు మరో ఎదురు దెబ్బ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top