పేటీఎమ్‌ పేమెంట్‌ బ్యాంక్‌కు చెక్‌  | RBI removes Paytm Payments Bank after licence cancellation | Sakshi
Sakshi News home page

పేటీఎమ్‌ పేమెంట్‌ బ్యాంక్‌కు చెక్‌ 

Oct 8 2026 6:27 AM | Updated on Oct 8 2026 6:27 AM

RBI removes Paytm Payments Bank after licence cancellation

షెడ్యూల్డ్‌ బ్యాంకుల జాబితా నుంచి తొలగింపు 

బ్యాంకింగ్‌ లైసెన్స్‌ రద్దు కారణంతో ఆర్‌బీఐ చర్యలు

ముంబై: గుర్తింపుపొందిన షెడ్యూల్డ్‌ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(పీపీబీఎల్‌)ను ఆర్‌బీఐ తొలగించింది. బ్యాంకింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేసిన నేపథ్యంలో తాజా చర్యలు చేపట్టింది. నిబంధనలు పాటించకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో పీపీబీఎల్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేసింది. డిపాజిటర్లకు హాని కలిగించే రీతిలో కార్యకలాపాలుండటంతో ఆర్‌బీఐ కొరడా ఝళిపించింది. 

తదుపరి పీపీబీఎల్‌ను మూసివేయవలసిందిగా ఢిల్లీ హైకోర్ట్‌ ఆదేశాలు జారీ చేసింది. వెరసి ఆర్‌బీఐ చట్టం 1934 రెండో షెడ్యూల్‌ నుంచి పీపీబీఎల్‌ను తప్పిస్తున్నట్లు కేంద్ర బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు జూలై31న నోటిఫికేషన్‌ జారీ చేయగా.. సెప్టెంబర్‌లో గెజిట్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. రెండో షెడ్యూల్‌ ద్వారా కేంద్ర బ్యాంకు ఆర్థిక ప్రమాణాలు అందుకున్న సంస్థలతో గుర్తింపుపొందిన బ్యాంకుల అధికారిక జాబితాను ఆర్‌బీఐ ప్రచురిస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement