చిన్న సంస్థలకు పేపాల్‌ సర్వీసులు | PayPal received inprinciple approval from the RBI | Sakshi
Sakshi News home page

చిన్న సంస్థలకు పేపాల్‌ సీమాంతర చెల్లింపు సేవలు

May 30 2025 9:01 AM | Updated on May 30 2025 9:04 AM

PayPal received inprinciple approval from the RBI

అగ్రిగేటరుగా వ్యవహరించేందుకు ఆర్‌బీఐ సూత్రప్రాయ అనుమతులు

ఎగుమతులపరమైన సీమాంతర చెల్లింపు లావాదేవీలకు సంబంధించి పేమెంట్‌ అగ్రిగేటరుగా వ్యవహరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి తమకు సూత్రప్రాయ అనుమతులు లభించినట్లు పేపాల్‌ హోల్డింగ్స్‌ భారతీయ అనుబంధ సంస్థ పేపాల్‌ పేమెంట్స్‌ వెల్లడించింది. దీనితో 200 పైగా మార్కెట్లలోని విదేశీ కస్టమర్ల నుంచి భారత్‌లోని చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు చెల్లింపులు పొందడానికి అవసరమైన సేవలు అందించవచ్చని పేర్కొంది.

ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!

ఈ సంస్థలు అంతర్జాతీయంగా వ్యాపార లావాదేవీలను సురక్షితంగా, సజావుగా నిర్వహించుకునేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని తెలిపింది. భారత్‌ గ్లోబల్‌ ఎగుమతుల హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో దేశీ వ్యాపార సంస్థలకు విశ్వసనీయమైన పేమెంట్‌ సొల్యూషన్స్‌ అందించేందుకు కట్టుబడి ఉన్నామని వివరించింది. పేపాల్‌ చెకవుట్, పేపాల్‌ ఇన్వాయిసింగ్, నో–కోడ్‌ చెకవుట్‌ టూల్స్‌ మొదలైన సురక్షితమైన సాధనాలతో దేశీ చిన్న సంస్థలు, అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నట్లు కంపెనీ సేల్స్‌ హెడ్‌ ఆబిద్‌ ముర్షీద్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement