ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ జేవీ | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ జేవీ

Published Thu, Feb 8 2024 4:59 AM

ONGC, NTPC Green Energy Limited sign Joint Venture - Sakshi

గోవా: దేశీ చమురు–గ్యాస్‌ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్‌జీసీ, అతిపెద్ద విద్యుత్‌ సంస్థ ఎన్‌టీపీసీ జాయింట్‌ వెంచర్‌ ఒప్పందంపై ఇండియా ఎనర్జీ వీక్‌ కార్యక్రమం వేదికగా బుధవారం సంతకం చేశాయి.

ఈ జేవీ ద్వారా భారత్‌తోపాటు విదేశాల్లో పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేస్తాయి. స్టోరేజ్, ఈ–మొబిలిటీ, కార్బన్‌ క్రెడిట్, గ్రీన్‌ క్రెడిట్, గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాపారంతోపాటు గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ మిథనాల్‌ వంటి   విభాగాల్లోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement