పెద్దపల్లిలో హల్‌చల్‌.. పల్సర్‌పై ఫాలో.. మహిళ మెడలో చైన్‌ చోరీ! | Karimnagar Ramagundam NTPC Krishnanagar Chain Snatching | Sakshi
Sakshi News home page

పెద్దపల్లిలో హల్‌చల్‌.. పల్సర్‌పై ఫాలో.. మహిళ మెడలో చైన్‌ చోరీ!

Oct 9 2026 12:15 AM | Updated on Oct 9 2026 12:15 AM

Karimnagar Ramagundam NTPC Krishnanagar Chain Snatching

కరీంనగర్‌: పెద్దపల్లి జిల్లా, రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో చైన్‌ స్నాచింగ్‌ కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దుండగులు పల్సర్‌ బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించారు. ఊహించని ఘటనతో బాధితురాలు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చైన్‌ లాక్కున్న వెంటనే దుండగులు అదే బైక్‌పై వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే, సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు చేపట్టారు. బైక్‌ నంబర్‌, నిందితుల ఆనవాళ్ల ఆధారంగా వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఇదీ చదవండి: సుక్మాలో మందుపాతర పేలుడు.. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement