శాంతించిన బ్లో అవుట్‌ ఊపిరి పీల్చుకున్న ‘నగరం’ | ongc gas leakblowout cooled off konaseema district in Andhra pradesh | Sakshi
Sakshi News home page

శాంతించిన బ్లో అవుట్‌ ఊపిరి పీల్చుకున్న ‘నగరం’

Nov 17 2026 5:33 PM | Updated on Nov 17 2026 5:37 PM

ongc gas leakblowout cooled off konaseema district  in Andhra pradesh

సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో  ఆందోళన రేపిన  గ్యాస్ బ్లో అవుట్  ఎట్టకేలకు శాంతించింది.మామిడికుదురు మండలం నగరంలో ఓఎన్జీసీ గ్యాస్‌ లీకేజీలను  రెస్క్యూ సిబ్బంది  అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో  అంతా ఊపిరి పీల్చుకున్నారు.మడ్ పంపింగ్ ద్వారా బ్లో అవుట్‌ నియంత్రించామని అధి​​కారులు వెల్లడించారు. 
స్ప్రింకిల్‌, వాటర్‌ అంబం‍రెల్లా విధానంతో తగ్గిన లీక్‌ వెల్‌ నెంబర్‌-7లో ‍గ్యాస్‌ లీకేజ్‌ను అరికట్టామనీ, . ప్రస్తుతం బావి దగ్గర ప్రమాదకర పరిస్థితులు లేవని అన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కాగా గ్యాస్‌ లీక్‌ కారణంగా చుట్టూ పక్కల ప్రాంతాలుప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. గ్యాస్‌ వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీంతో ముందస్తు  చర్యగా అధికారులు  చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించారు.  జాతీయ రహదారిపై వాహనాలను నిలిపివేశారు. 

గ్యాస్ లీక్ అయిన ప్రదేశం చుట్టూ  ఒక కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని ఖాళీ చేయించామనీ సుమారు 400 నుండి 500 కుటుంబాలను తరలించామని  జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి విద్యుత్ ఉపకరణాలు, లైట్లు లేదా గ్యాస్ స్టవ్‌లను ఉపయోగించవద్దని స్థానికులకు సూచించారు. అలాగే సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రజలకు మధ్యాహ్న, రాత్రి భోజన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చూసుకుంటుందని ఆయన తెలిపారు. చివరికి పరిస్థితి అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: కోనసీమలో మళ్లీ కలకలం.. భారీ శబ్దాలతో గ్యాస్‌ లీక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement