
55.9 కోట్ల జన్‌ధన్ ఖాతాలు
కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి
న్యూఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందరికీ అందించేందుకు, అధికారిక ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేసేందుకు కృషి చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు.
2014లో ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) పథకాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ పథకం కింద ఎలాంటి బ్యాలన్స్ అవసరం లేని బేసిక్ సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం తెలిసిందే. ఇప్పటికి 55.90 కోట్ల జన్‌ధన్ యోజన ఖాతాలు ప్రారంభమైనట్టు చెప్పారు. ఆర్థిక సేవల విస్తృతిపై అవగాహన కల్పించేందుకు, బ్యాంక్ ఖాతాల పునర్ కేవైసీ సేవల కోసం బ్యాంక్‌లు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయని.. జూలై 1న ఇది మొదలు కాగా, సెపె్టంబర్ 30తో ముగుస్తుందన్నారు.