breaking news
Pradhan Mantri Jan Dhan Yojana scheme
-
అందరికీ ఆర్థిక సేవలకు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందరికీ అందించేందుకు, అధికారిక ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేసేందుకు కృషి చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. 2014లో ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) పథకాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ పథకం కింద ఎలాంటి బ్యాలన్స్ అవసరం లేని బేసిక్ సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం తెలిసిందే. ఇప్పటికి 55.90 కోట్ల జన్‌ధన్ యోజన ఖాతాలు ప్రారంభమైనట్టు చెప్పారు. ఆర్థిక సేవల విస్తృతిపై అవగాహన కల్పించేందుకు, బ్యాంక్ ఖాతాల పునర్ కేవైసీ సేవల కోసం బ్యాంక్‌లు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయని.. జూలై 1న ఇది మొదలు కాగా, సెపె్టంబర్ 30తో ముగుస్తుందన్నారు. -
50 కోట్ల మార్క్‌ను దాటిన జన్‌ధన్ యోజన
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్క్‌ను అధిగమించింది. ప్రారంభించిన తొమ్మిదేళ్లలో ఈ మైలురాయి నమోదైంది. ఇందులో 56 శాతం ఖాతాలు మహిళల పేరిట ప్రారంభమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మొత్తం జన్‌ధన్ ఖాతాల్లో 67 శాతం గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచి ఉన్నట్టు పేర్కొంది. ఈ ఖాతాల్లో మొత్తం రూ.2.03 లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా, ఈ ఖాతాలకు సంబంధించి 34 కోట్ల రూపే కార్డులను ఉచితంగా అందించినట్టు తెలిపింది. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఒక్కో ఖాతాలో సగటు బ్యాలన్స్ రూ.4,076గా ఉందని.. 5.5 కోట్ల ఖాతాలు ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు అందుకుంటున్నట్టు వెల్లడించింది. 2014 ఆగస్ట్ 28న ఈ పథకం ప్రారంభం కావడం గమనార్హం. ఈ ఖాతాల్లో కనీస బ్యాలన్స్ నిర్వించాల్సిన అవసరం ఉండదు. రూ.2 లక్షల ప్రమాద మరణ బీమాతో కూడిన రూపే కార్డు ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు, ఈ ఖాతా నుంచి రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. -
డెబిట్ కార్డ్స్ మార్కెట్లో రూపే వాటా 38 శాతం
ముంబై: రూపే కార్డ్స్ మార్కెట్ వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. దేశంలో జారీ అయిన రూపే డెబిట్ కార్డుల సంఖ్య జనవరి నాటికి 24.7 కోట్లుగా ఉంది. జారీ అయిన మొత్తం 64.5 కోట్ల డెబిట్ కార్డుల్లో దీని వాటా 38 శాతం. రూపే కార్డ్స్ మార్కెట్ వాటా పెరుగుదలకు కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం బాగా దోహదపడింది. రూపే కార్డుల జారీ ఎక్కువగా జన్ ధన్ ఖాతాలకే జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో జేఎం ఫైనాన్షియల్ ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. రూపే కార్డుల మార్కెట్ వాటా ఏటీఎం లావాదేవీల వారీగా చూస్తే 20.4 శాతంగా, పాయింట్ ఆఫ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ ప్రకారం చూస్తే 4.1 శాతంగా ఉంది. ఇక ఆన్లైన్ లావాదేవీల్లో రూపే వాటా 1.6 శాతం. కాగా సంస్థ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూపే క్రెడిట్ కార్డులను కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.