4,500 దాటిన హైదరాబాద్ కంపెనీ ఎలక్ట్రిక్‌ బస్సులు | Olectra GreenTech 35 New Electric Buses Maharashtra | Sakshi
Sakshi News home page

4,500 దాటిన హైదరాబాద్ కంపెనీ ఎలక్ట్రిక్‌ బస్సులు

Nov 3 2026 5:40 PM | Updated on Nov 3 2026 5:58 PM

Olectra GreenTech 35 New Electric Buses Maharashtra

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తాజాగా మహారాష్ట్రలో కార్యకలాపాలు విస్తరించింది. ఛత్రపతి సంభాజీనగర్‌లో వివిధ మార్గాల్లో మరో 35 ఏసీ విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టింది. వీటిని ఈవీ ట్రాన్స్‌ సంస్థ నిర్వహిస్తుంది. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 55 నగరాలవ్యాప్తంగా 4,500 పైగా విద్యుత్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లయిందని ఈ సందర్భంగా కంపెనీ ఎండీ మహేశ్‌ బాబు తెలిపారు.

ఇవి 75 కోట్లకు పైగా గ్రీన్‌ కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేయడం తమ సంస్థ ప్రస్థానంలో కీలక మైలురాయని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక బ్లేడ్‌ బ్యాటరీ సాంకేతికతతో తయారు చేసే తమ బస్సుల్లో ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని మహేశ్‌ బాబు వివరించారు. మోనోకాక్‌ నిర్మాణంతో రూపొందే ఈ బస్సుల్లో ముందు, వెనుక భాగాల్లో ఎయిర్‌ సస్పెన్షన్‌ వ్యవస్థ, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టం (ఏబీఎస్‌), రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయన్నారు. పర్యావరణహితమైన ప్రజా రవాణా వ్యవస్థ దిశగా భారత్‌ గణనీయమైన పురోగతి సాధిస్తోందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement