స్టాక్‌ మార్కెట్‌లో కొత్త ఇండెక్స్‌ | NSE launches Nifty Waves Index at WAVES 2025 | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్‌లో కొత్త ఇండెక్స్‌

May 3 2025 7:40 AM | Updated on May 3 2025 7:43 AM

NSE launches Nifty Waves Index at WAVES 2025

ముంబై: స్టాక్‌ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా నిఫ్టీ వేవ్స్‌ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్‌ పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహించే 43 లిస్టెడ్‌ కంపెనీలతో ఇండెక్స్‌ను రూపొందించింది. తద్వారా ఫిల్మ్, టీవీ, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్, మ్యూజిక్, గేమింగ్‌ తదితర వివిధ పరిశ్రమలకు చోటు కల్పించింది.

స్టోరీలు, మ్యూజిక్, ఇన్నోవేషన్, క్రియేటివ్‌ స్పిరిట్‌ ఇకపై దేశం నుంచి భారీగా ఎగుమతికానున్నట్లు 2025 వేవ్స్‌లో ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ను విడుదల చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. 2005 ఏప్రిల్‌1 ఇండెక్స్‌కు బేస్‌కాగా.. ప్రాథమిక విలువను 1,000గా నిర్ధారించారు.

దేశీయంగా అత్యంత డైనమిక్‌ రంగాలలో ఒకటైన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ లోతును ప్రతిబింబించే విధంగా నిఫ్టీ వేవ్స్‌ ఇండెక్స్‌కు తెరతీసినట్లు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement