ఏఐ షాపింగ్‌లో జెన్‌జీ కంటే మినియల్స్ టాప్‌! | AI Shopping Trend, India Ranks Second Globally As 84% of Millennials Adopt AI Powered Shopping Tools, Surpassing Gen Z | Sakshi
Sakshi News home page

ఏఐ షాపింగ్‌లో జెన్‌జీ కంటే మినియల్స్ టాప్‌!

Nov 1 2026 4:40 PM | Updated on Nov 1 2026 5:20 PM

Millennials Outpace Gen Z India AI Shopping Boom McKinsey Report

సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో భారతీయ వినియోగదారుల కొనుగోలు శైలిలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఏఐ ఆధారిత షాపింగ్‌ టూల్స్‌ను ఉపయోగించడంలో మినియల్స్‌ సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. ప్రముఖ గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కంపెనీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతదేశంలో మినియల్స్‌(1981 నుంచి 1996 మధ్య జన్మించిన వారు)లో ఏఐ షాపింగ్‌ అడాప్షన్‌ ఏకంగా 84 శాతంగా నమోదైంది. దీనితో వారు జెన్‌జీ (1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారు-74 శాతం)తో పోలిస్తే ముందుజలో ఉన్నారు.

ప్రపంచ స్థాయిలో భారత్‌కు రెండో స్థానం

ఏఐ ఆధారిత కొనుగోళ్లలో చైనా తొలి స్థానంలో ఉండగా భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ సగటు (53 శాతం)తో పోలిస్తే భారతదేశంలో ఏఐ షాపింగ్‌ వినియోగం 76 శాతంగా ఉండటం విశేషం. దేశంలోని వినియోగదారులు కేవలం ప్రొడక్ట్ సెర్చ్‌ చేయడం వరకే పరిమితం కాకుండా వస్తువులను పోల్చడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, చివరికి చెల్లింపులు పూర్తి చేయడానికి కూడా ఏఐ టూల్స్‌పై ఆధారపడుతున్నారు.

తరాల వారీగా ఏఐ షాపింగ్ వినియోగ తీరు

మెకిన్సే ఏజెంట్ కామర్స్ కన్స్యూమర్ సర్వే ప్రకారం వివిధ వర్గాల వినియోగదారుల భాగస్వామ్యం ఇలా ఉంది.

  • మినియల్స్: 84 శాతం

  • జెన్-జీ: 74 శాతం

  • జెన్ ఎక్స్: 74 శాతం

  • బేబీ బూమర్స్: 56 శాతం

ఈ గణాంకాలను బట్టి చూస్తే డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్‌లో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న భారత్ ఇప్పుడు ఏజెంటిక్ కామర్స్(మనుషులు ఇచ్చే ఆదేశాల ప్రకారం పనిచేయడమే కాకుండా స్వయంగా ఆలోచించి, విశ్లేషించి, కొనుగోలు నిర్ణయాలు తీసుకోగల ఏఐ ఏజెంట్లు ద్వారా జరిగే ఈ-కామర్స్ వ్యాపార విధానం) దిశగా అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: బంగారం చిన్నబోతోందెందుకో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement