
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తాం
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ముంబై: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, భూమిపై ఏ శక్తి దీన్ని అడ్డుకోలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశీ ఆరి్థక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఎన్నో చర్యలను ప్రభు త్వం తీసుకుందన్నారు. మౌలిక వసతుల కల్పనతోపాటు అంతర్జాతీయ వాణిజ్య విస్తరణకు చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్‌ఎఫ్) 6వ ఎడిషన్‌ను ఉద్దేశించి మంత్రి గోయల్ మాట్లాడారు.
‘‘నేడు ప్రపంచం భారత్‌ను విశ్వసిస్తోంది. అత్యున్నత నాణ్యమైన నిపుణులు, వస్తు, సేవలకు భారత్ హామీ ఇస్తోంది. 100 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. టెక్నాలజీతో కలసి సాగకుంటే ఇది సాధ్యం కాదు. 2047 నాటికి 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారత్ ఆకాంక్షిస్తున్నప్పుడు ఆరి్థక ప్రపంచంలో మన మిత్రులు తమదైన అంచనాలు వేసుకుంటారు.
కానీ, ఇది సాధ్యమేనని మీరు చూ స్తారు. మనందరం సమిష్టిగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని మంత్రి పేర్కొన్నారు. వినియోగంపై ఆధారపడిన ఆరి్థక వ్యవస్థను ఉరకలెత్తించేందుకు ప్రభుత్వం తన వంతుగా కీలక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ విదేశీ వాణిజ్యం విస్తరణకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో ఎగుమతులు 4–5% మేర పెరుగుతాయన్న అంచనాను వ్యక్తం చేశారు.