breaking news
Minister of Commerce
-
భారత్ అభివృద్ధిని ఏ శక్తీ నిలువరించలేదు
ముంబై: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, భూమిపై ఏ శక్తి దీన్ని అడ్డుకోలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశీ ఆరి్థక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఎన్నో చర్యలను ప్రభు త్వం తీసుకుందన్నారు. మౌలిక వసతుల కల్పనతోపాటు అంతర్జాతీయ వాణిజ్య విస్తరణకు చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 6వ ఎడిషన్‌ను ఉద్దేశించి మంత్రి గోయల్ మాట్లాడారు. ‘‘నేడు ప్రపంచం భారత్‌ను విశ్వసిస్తోంది. అత్యున్నత నాణ్యమైన నిపుణులు, వస్తు, సేవలకు భారత్ హామీ ఇస్తోంది. 100 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. టెక్నాలజీతో కలసి సాగకుంటే ఇది సాధ్యం కాదు. 2047 నాటికి 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారత్ ఆకాంక్షిస్తున్నప్పుడు ఆరి్థక ప్రపంచంలో మన మిత్రులు తమదైన అంచనాలు వేసుకుంటారు. కానీ, ఇది సాధ్యమేనని మీరు చూ స్తారు. మనందరం సమిష్టిగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని మంత్రి పేర్కొన్నారు. వినియోగంపై ఆధారపడిన ఆరి్థక వ్యవస్థను ఉరకలెత్తించేందుకు ప్రభుత్వం తన వంతుగా కీలక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ విదేశీ వాణిజ్యం విస్తరణకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో ఎగుమతులు 4–5% మేర పెరుగుతాయన్న అంచనాను వ్యక్తం చేశారు. -
దేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి
శాన్ ఫ్రాన్సిస్కో: ’బ్రాండ్ ఇండియా’కు ప్రచారకర్తలుగా వ్యవహరించాలని భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు (సీఏ) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. దేశంలోకి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని, దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్ వచ్చే 30 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని గోయల్ చెప్పారు. ‘భారత్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి మీరు అంతర్జాతీయ క్లయింట్లకు వివరించండి. ఆ విధంగా అమెరికాలోను ఇతర ప్రాంతాల్లోను ఉన్న భారతీయ సీఏలు ఆయా దేశాలకు, భారత్‌కు మధ్య వారధిగా నిల్చినవారవుతారు‘ అని ఆయన పేర్కొన్నారు. అలాగే అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలను భారత్ అందుబాటు ధరల్లోనే అందిస్తున్న విషయాన్ని కూడా ఇతర దేశాలకు తెలియజేయాలని గోయల్ సూచించారు. ఐసీఏఐ సభ్యులు పండుగలు మొదలైన సందర్భాల్లో బహుమతులు ఇచ్చేందుకు మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. దేశీ సీఏ సంస్థలు అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలుగా ఎదిగే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. -
ఎగుమతుల్లో కొత్త రికార్డులు సాధిస్తాం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ పుంజుకుంటోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వస్తు, సేవల ఎగుమతుల్లో చారిత్రక గరిష్ట స్థాయులను సాధించే దిశగా దేశం పురోగమిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. అలాగే సర్వీసుల ఎగుమతులకు సంబంధించి 150 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించగలమని ఆయన పేర్కొన్నారు. వెరసి ఇటు వస్తువులు, అటు ఉత్పత్తుల విషయంలో రికార్డు స్థాయి ఎగుమతులు నమోదు చేయగలమని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో దేశంలోకి 27 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని మంత్రి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 62 శాతం ఎగిశాయని వివరించారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగిందని, లాక్డౌన్ విధించిన ప్రతికూల పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ వ్యవస్థకు ఎటువంటి అంతరాయాలూ ఏర్పడకుండా సేవలు అందించిందని మంత్రి చెప్పారు. దేశ ఎకానమీ వేగంగా కోలుకుంటోందనడానికి అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1.3 లక్షల పైగా నమోదు కావడం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత్‌కి ఉన్న సానుకూల అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ ఇటీవలే భారత సార్వభౌమ రేటింగ్‌ను నెగెటివ్ నుంచి స్టేబుల్ స్థాయికి మార్చిందని మంత్రి చెప్పారు. మెరుగైన ఇన్ఫ్రా, వృద్ధిలో వైవిధ్యం, అభివృద్ధికి డిమాండ్ తదితర అంశాలు ఆర్థిక పునరుజ్జీవనానికి దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. -
గుర్తింపు కార్డులతో కార్మికులకు ప్రయోజనాలు
కదిరి అర్బన్: గుర్తింపు కార్డులు కలిగి ఉండే కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని మార్కెటింగ్ శాఖా మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్థానిక ఎమ్యెల్యే అత్తార్ చాంద్‌బాషా నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కదిరిలో భవన, బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారంతా గుర్తింపు కార్డులు తీసుకోవాలన్నారు. గుర్తింపు కార్డులు కలిగిన కార్మికులకు ఇళ్లు కూడా మంజూరు చేస్తారని ఆయన చెప్పారు. ఇళ్లు కట్టుకున్నాక అత్యవసరమైతే విక్రయించుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు. ఇంటిపై ఉన్న రుణం కొన్నవారు కట్టుకోవాలన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు చంద్రన్న భీమా పథకంలో చేరితే వారింట్లోని ఇద్దరు అమ్మాయిలకు ఒక్కొక్కరి వివాహానికి రూ.20 వేల చొప్పున పెళ్లికానుక, అలాగే ఒక్కొక్కరికి రెండు ప్రసవాలకు రూ.20 వేల చొప్పున ప్రసవ కానుక అందజేస్తారన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.


