కోడింగ్ అవసరమే లేదు!.. ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

కోడింగ్ అవసరమే లేదు!.. ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు

Published Mon, Feb 26 2024 4:33 PM

No One Will Require C Java Coding Languages Says Nvidia CEO - Sakshi

ప్రారంభం నంజుంచి ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ సామర్థ్యానికి ప్రజలు మంత్ర ముగ్దులయ్యారు. నేడు ఈ టెక్నాలజీ ఉన్నత శిఖరాలను చేరుకుంటోంది. దిగ్గజ సంస్థలు సైతం ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఓపెన్ఏఐ మాత్రమే కాకుండా గూగుల్,  మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా సొంత చాట్‌బాట్‌లు, జెమిని, బింగ్‌ వంటి వాటిని ఆవిష్కరించుకున్నాయి. ఇటీవల దేశీయ దిగ్గజం రిలయన్స్ కంపెనీ కూడా హనూమాన్ (Hanooman) అనే ఏఐ ఆవిష్కరించింది.

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తు 'ఏఐ'దే అంటున్నారు. ఏఐ కారణంగా చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతుంటే.. ఈ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు మాత్రం డిమాండ్ పెరిగిపోతోంది. ఉద్యోగం కావాలంటే తప్పకుండా టెక్నాలజీలో నైపుణ్యం కలిగి ఉండాలని పలువురు నిపుణులు చెబుతున్నారు.

ఈ సమయంలో ఎన్విడియా (Nvidia) సీఈఓ 'జెన్సన్ హువాంగ్' కూడా ఏఐ ప్రభావం ఉద్యోగాల మీద చాలా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి ప్రపంచంలో పిల్లలు కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. గతంలో ప్రతి ఒక్కరూ కోడింగ్ నేర్చుకోవాలని సూచించారు, కానీ నేడు దాని అవసరం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఛాట్‌జీపీటీకి పోటీగా మన ‘హనూమాన్‌’!

ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మానవీయంగా ఉండేలా టెక్నాలజీని క్రియేట్ చేయడం తమ బాధ్యతని సీఈఓ జెన్సన్ హువాంగ్ పేర్కొన్నారు. కాబట్టి ఇక మీద సీ++, జావా వంటి కోడింగ్ లాంగ్వేజస్ అవసరం లేదని, రాబోయే రోజుల్లో ఏఐ మరింత వృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement