నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు మరో షాక్‌! | Netflix may rise prices after success of password sharing crackdown | Sakshi
Sakshi News home page

నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు మరో షాక్‌!

Oct 16 2023 8:38 PM | Updated on Oct 16 2023 8:44 PM

Netflix may rise prices after success of password sharing crackdown - Sakshi

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) యూజర్లకు మరో షాక్‌ ఇవ్వనుంది. ఇదివరకే పాస్‌వర్డ్-షేరింగ్‌పై పరిమితి తీసుకొచ్చిన ఈ స్ట్రీమింగ్‌ దిగ్గజం ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు పెంచేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

పాస్‌వర్డ్-షేరింగ్‌ను కట్టడి చేసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ మూడవ త్రైమాసికంలో సుమారు 6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. తాజాగా ఆదాయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

వాల్ట్ డిస్నీ వంటి ప్రత్యర్థులు ఈ ఏడాది యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ చార్జలు పెంచినప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌ మాత్రం పెంచలేదు. కేవలం పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై మాత్రమే పరిమితి విధించింది.  ఈ ప్రయత్నం విజయవంతమై సుమారు 6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకోగలిగింది.

హాలీవుడ్ నటీనటుల సమ్మె ముగిసిన తర్వాత ధరలను పెంచే అవకాశం ఉందని అక్టోబర్‌లో ఓ మీడియా నివేదిక తెలిపింది. హాలీవుడ్‌ను గందరగోళంలో ముంచెత్తిన సమ్మెకు పిలుపునిచ్చిన ఐదు నెలల తర్వాత, రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా గత వారం ప్రధాన స్టూడియోలతో కొత్త ఒప్పందాన్ని ఆమోదించింది.

ఈ క్రమంలో రానున్న నెలల్లో నెట్‌ఫ్లిక్స్‌ యాడ్‌ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ల చార్జీలు పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  పాస్‌వర్డ్ షేరింగ్‌ కట్టడి తర్వాత నెట్‌ఫ్లిక్స్‌కు సభ్యత్వం పొందిన చాలా మంది యూజర్లు యాడ్-ఫ్రీ ప్లాన్‌లను ఎంచుకున్నారని విశ్లేషకులు తెలిపారు. ప్రకటనలతో కూడిన దాని ప్రామాణిక ప్లాన్‌కు నెలకు 6.99 డాలర్లు ఉండగా  ప్రకటన రహిత ప్లాన్‌లు 15.49 డాలర్ల నుంచి ప్రారంభమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement