ప్రశ్నపత్రాల లీకేజీలకు చెక్.. నందన్ నీలేకని మాస్టర్ ప్లాన్! | Nandan Nilekani Proposes AI Generated Exam Papers To Curb Leaks | Sakshi
Sakshi News home page

ప్రశ్నపత్రాల లీకేజీలకు చెక్.. నందన్ నీలేకని మాస్టర్ ప్లాన్!

Oct 13 2026 8:45 PM | Updated on Oct 13 2026 9:13 PM

Nandan Nilekani Proposes AI Generated Exam Papers To Curb Leaks

దేశంలో పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ యూఐడీఏఐ ఛైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా అడ్డుకునేందుకు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. పరీక్ష జరిగే రోజే ఏఐ సాయంతో ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తే లీకేజీల సమస్యను చాలా వరకు తగ్గించవచ్చని తెలిపారు.

పరీక్ష రోజే ప్రశ్నపత్రం
బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మాట్లాడిన నందన్ నీలేకని.. ప్రశ్నపత్రాల లీకేజీలకు ప్రధాన కారణం అక్రమంగా డబ్బు సంపాదించడమే. దీనికి తగిన పరిష్కారం ఏమిటంటే.. ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలతో కూడిన ఒక డేటాబేస్ రూపొందించి, అందులో నుంచి పరీక్ష జరిగే రోజే అవసరమైన ప్రశ్నలను ఎంపిక చేసి ప్రశ్నపత్రాన్ని తయారు చేయడమే అని వివించారు. ఇలా చేస్తే ముందుగానే ప్రశ్నపత్రాన్ని సంపాదించి లీక్ చేసే అవకాశం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

కంప్యూటర్ పరీక్షల విస్తరణ
ప్రశ్నపత్రాల తయారీతో పాటు దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBT) విధానాన్ని కూడా విస్తరించాలని నీలేకని సూచించారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1.5 లక్షల ప్రాంతాల్లో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుందని, ఈ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే.. ఈ విధానం విజయవంతం కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ తగిన కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి.

పరీక్షల నిర్వహణలో మార్పుల కోసం ఏర్పాటు చేసిన కమిటీలో తాను పనిచేస్తున్నట్లు నీలేకని వెల్లడించారు. ఈ వ్యవస్థలోని సమస్యలను గుర్తించి పరిష్కారాలను సూచిస్తామని తెలిపారు. కమిటీ నిర్ణయాలను అమలు చేయడంపై ప్రధానమంత్రి ఆసక్తిగా ఉన్నారని కూడా పేర్కొన్నారు. అయితే.. ఏఐతో ప్రశ్నపత్రాల తయారీ విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు, మొదట ఏ పరీక్షల్లో ప్రవేశపెడతారు అనే వివరాలను నీలేకని వెల్లడించలేదు.

ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ పన్నులు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement