ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామిక కస్టమర్లకు ఉత్పత్తులు, సేవలు అందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు అభయ్ ఇస్పాత్ చైర్మన్ వినేష్ మెహతా తెలిపారు. అత్యధిక వృద్ధికి అవకాశమున్న షీట్ మెటల్ కాంపోనెంట్స్, కోటింగ్ విభాగాల్లో కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు చెప్పారు.
ఈ రెండింటిపై ఫోకస్ పెట్టడమనేది అటు పారిశ్రామిక రంగంలో, ఇటు నిర్మాణ.. మౌలిక రంగాల్లో డిమాండ్‌కి తగ్గ స్థాయిలో సరఫరా చేసేందుకు తోడ్పడగలదని పేర్కొన్నారు. దేశీయంగా కోటెడ్ స్టీల్ మా ర్కెట్ 2024లో 27.7 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2030 నా టికి వార్షికంగా 7.4% వృద్ధితో 42 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనా.


