Merger Of HDFC With HDFC Bank Effective From July 1 - Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం

Jun 27 2023 5:00 PM | Updated on Jun 27 2023 5:39 PM

Merger Of Hdfc With Hdfc Bank Effective From July 1 - Sakshi

దేశీయ హౌసింగ్‌ ఫైనాన్స్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ.. ప్రైవేట్‌ బ్యాంక్‌ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో విలీనం కానుంది. విలీనం ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుందని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీప్‌క్‌ పరేక్‌ తెలిపారు. విలీనానికి ఆమోదం తెలిపేందుకు హెచ్‌డీఎఫ్‌సీ, ప్రైవేట్ బ్యాంక్ బోర్డులు జూన్ 30న సమావేశం కానున్నట్లు పరేఖ్ వెల్లడించారు. హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ ఛైర్మన్‌ , సీఈవో కేకే మిస్త్రీ మాట్లాడుతూ.. కార్పొరేషన్ స్టాక్ డీలిస్టింగ్ జూలై 13 నుండి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. 

దేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద లావాదేవీగా పేర్కొందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత ఏడాది ఏప్రిల్ 4న హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీని స్వాధీనం చేసుకునేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ సుమారు 40 బిలియన్ల డాలర్లు.

విలీన అనంతరం ఇరు సంస్థల ఆస్తుల విలువ రూ.18 లక్షల కోట్లకు చేరనుంది. విలీనం అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన ప్రతి 25 షేర్లకు గానూ హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ హోల్డర్లకు 42 షేర్లు చొప్పున లభిస్తాయి. విలీన సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌గా కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement